మచిలీపట్నం: ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ దాడులు

1చూసినవారు
మచిలీపట్నం: ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ దాడులు
మచిలీపట్నం మండలం పేదకర అగ్రహారం గ్రామంలో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పరస కృష్ణవేణి అనే వ్యక్తికి చెందిన సుమారు 3.5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితురాలిని స్టేషన్‌కు అప్పగించారు. ఈ దాడుల్లో సబ్ ఇన్స్పెక్టర్ రామ శేషయ్య, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లో నాటు సారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :