మచిలీపట్నం: చంద్రబాబుపై మాజీ మంత్రి విమర్శలు

1774చూసినవారు
రాష్ట్రంలో నెలకొన్న డీజిల్ కొరతపై మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం మచిలీపట్నంలో మాట్లాడుతూ, గత నాలుగు రోజులుగా డీజిల్ లభించక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చంద్రబాబు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. తనకున్న ముందుచూపును మోదీతో పోల్చుకునే చంద్రబాబు, డీజిల్ కొరతను ముందుగానే గుర్తించి పరిష్కరించడంలో ఎందుకు విఫలమయ్యారో వివరించాలని నాని డిమాండ్ చేశారు.