మచిలీపట్నం: రైతుల సంక్షేమానికి కృషి చేస్తాను: చైర్మన్

71చూసినవారు
మచిలీపట్నం: రైతుల సంక్షేమానికి కృషి చేస్తాను: చైర్మన్
రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని మచిలీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని పేర్కొన్నారు. సోమవారం ఉదయం మచిలీపట్నం మార్కెట్ యార్డులో నూతన చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. తనను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి కొల్లు రవీంద్రకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్