తుపాను కారణంగా ముంపునకు గురైన పంట పొలాలలోని నీటిని బయటకు పంపేందుకు వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుంచి ఇరిగేషన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు (ఏఈ), వ్యవసాయ అధికారులతో (ఏఓ) టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ సూచనలు చేశారు. నీటి తొలగింపునకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.