రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బుధవారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ,
జగన్ రెడ్డికి, ఆ పార్టీ నేతలకు వెన్నుపోటు అని మాట్లాడే కనీస అర్హత కూడా లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి హామీని అమలు చేశామని, రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, పెట్టుబడులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఐదేళ్ల
వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయలేదని విమర్శించారు.