బందరు పోర్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్ క్రెడిట్ చోరీకి పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వేగంగా జరుగుతున్న పనులను పరిశీలించి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. గతంలో వైసీపీ పోర్టును బందరు నుంచి వెళ్లగొట్టిందని, ప్రజా ఉద్యమం ద్వారా తిరిగి తెచ్చుకున్నామని తెలిపారు. తాము పనులు ప్రారంభిస్తే జగన్ వచ్చాక నిలిపివేశారని, కూటమి వచ్చాక పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.