పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం లక్ష్మీ టాకీస్ సెంటర్ ప్రధాన కూడలి వద్ద పోలీస్ బ్యాండ్ సిబ్బందితో కళాజాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాలను ఆలపిస్తూ, పోలీస్ అమరవీరుల త్యాగాలను, సేవలను ప్రజలకు తెలియజేశారు. రాఘవయ్య, ఆర్ ఎస్ఐలు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు పోలీసుల సేవలను, త్యాగాలను గుర్తుచేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.