మచిలీపట్నం: డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి

11చూసినవారు
మచిలీపట్నం: డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి
మచిలీపట్నం బలరాంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే ఏసు పాదం (55) అనే వ్యక్తి ఇంటి డాబాపై నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవడంతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏసు పాదం మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్