మచిలీపట్నం మండలం పెద్దపట్నంలో నివాసం ఉంటున్న యానాది కుటుంబాలను ప్రభుత్వం ప్రకటించిన పి-4 కార్యక్రమం కింద దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ప్రకటించారు. పెన్షన్ల పంపిణీ సందర్భంగా యానాది కుటుంబాల దుస్థితిని చూసి చలించిపోయిన మంత్రి, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా ప్రజలు కష్టాలు పడడం బాధాకరమని పేర్కొన్నారు. ఆ కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.