మచిలీపట్నం గ్రామీణ మండలంలో మంత్రి కొల్లు రవీంద్ర గురువారం పర్యటించి, వాడపాలెంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల వినతులను స్వీకరించి, తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సంక్షేమ పథకాలు అందని వారికి వెంటనే అందించాలని సూచించారు.