మచిలీపట్నం: సమావేశానికి సిద్ధం కావాలి

12చూసినవారు
మచిలీపట్నం: సమావేశానికి సిద్ధం కావాలి
ఈనెల 5వ తేదీన జరగనున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి విద్యాధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బాలాజీ సూచించారు. ఈ నేపథ్యంలో, కలెక్టర్ నగరంలోని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఏర్పాట్లను పరిశీలించారు. రాజుపేట నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రాధమిక ఉన్నత పాఠశాలను సందర్శించి, ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి, చేపట్టాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.