మచిలీపట్నం: 20 కేంద్రాల్లో ఎన్ఎంఎంఎస్ పరీక్ష: డీఈఓ

8చూసినవారు
మచిలీపట్నం: 20 కేంద్రాల్లో ఎన్ఎంఎంఎస్ పరీక్ష: డీఈఓ
ఈనెల 7వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈఓ రామారావు మంగళవారం సాయంత్రం తెలిపారు. జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 4040 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నం డివిజన్లో 9 కేంద్రాల్లో 1838 మంది, గుడివాడ డివిజన్లో 6 కేంద్రాల్లో 1213 మంది, ఉయ్యూరు డివిజన్లో 5 కేంద్రాల్లో 989 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని డీఈఓ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్