మచిలీపట్నం: పన్నులు చెల్లించడం ఇక సులభతరం

4చూసినవారు
కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ, గ్రామపంచాయతీల్లో ఇంటి, కుళాయి పన్నుల చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ శాఖ రూపొందించిన క్యూఆర్ కోడ్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా ప్రజలు ఇంటి నుంచే పన్నులు చెల్లించవచ్చని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి అరుణతో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్