బుధవారం సాయంత్రం మచిలీపట్నం రూరల్ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రుద్రవరం ఏరియాలో బీభత్సమైన గాలివాన కారణంగా అనేక చెట్లు నేలకొరిగాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షం వల్ల పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా ఈదురు గాలులు వీస్తున్నాయి.