మచిలీపట్నం రూరల్ మేకవానిపాలెం గ్రామ పరిధిలోని సీతయ్యనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట తావులపై తాలూకా ఎస్ఐ రమేష్ తన సిబ్బందితో కలిసి మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ. 33, 370 నగదు, 5 బైకులు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్ఐ రమేష్ జూదరులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.