కృష్ణాజిల్లాలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ హెచ్చరించారు. గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బడ్డీ కొట్లను పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. గుట్కా, పాన్ పరాగ్ వంటివి విక్రయించిన యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా డీఎస్పీలు, సిఐలు ఈ తనిఖీలు చేశారు.