మచిలీపట్నం: ఈనెల 14 లోపు పాఠశాలలకు హాజరు కావాలి

72చూసినవారు
మచిలీపట్నం: ఈనెల 14 లోపు పాఠశాలలకు హాజరు కావాలి
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్లు భర్తీ చేయడానికి నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేశామని సమన్వయ అధికారి మురళీకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ప్రతిభ ఆధారంగా సీట్లు పొందిన విద్యార్థులకు ఇప్పటికే ఫోన్ ద్వారా సమాచారం అందించామన్నారు. ఈ నెల 14వ తేదీలోగా వారందరూ అన్ని ధ్రువీకరణ పత్రాలతో గురుకుల పాఠశాలలో హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్