జిల్లాలో ఇంధన సరఫరాలో తలెత్తిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ డీకే. బాలాజీ సోమవారం మీడియాకు తెలిపారు. ప్రతి పెట్రోల్ బంక్ వద్ద రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులను నియమించి పరిస్థితులను మెరుగుపరుస్తున్నామన్నారు. ఆయిల్ కంపెనీలతో మాట్లాడి, అవసరమైన మేరకు స్టాక్ తెప్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.