మచిలీపట్నం: జిల్లా కేంద్రంలో విషాద సంఘటన

0చూసినవారు
మచిలీపట్నం పట్టణంలో పోతేపల్లి శ్రీనగర్ కాలనీలో శుక్రవారం రాత్రి ఒక విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. నివాసం ఉంటున్న నర్రా రూతమ్మ మరణించి ఐదు రోజులు గడిచినా, ఈ విషయం బయటకు తెలియకపోవడం స్థానికులను కలవరపరిచింది. మృతురాలి కుమార్తె సుమతికి మతిస్థిమితం లేకపోవడంతో, తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. ఇంటికి వచ్చిన వారిపై రాళ్లు విసురుతూ అల్లరి చేయడంతో స్థానికులు అప్రమత్తమై ఈ విషయాన్ని తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్