కృష్ణాజిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మాట్లాడుతూ, రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగింది.