మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని కాపు కులంపై జరిగిన దాడిగా చిత్రీకరించడం గర్హనీయమని మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. ఆదివారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండించారు. అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం చెందిన ప్రజలే దాడి చేశారని, అంబటిపై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి కట్టుదిట్టమైన భద్రతతో ఆయన్ని అరెస్ట్ చేసిందని తెలిపారు.