మచిలీపట్నం: వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు

11చూసినవారు
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇది ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆదివారం మచిలీపట్నంలో సుమారు రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సెమీ ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు.