మచిలీపట్నం వైసీపీ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి పదవిలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపుల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిని తొలగించడం వెనుక డబ్బుల వ్యవహారం ఉందని ఆయన ప్రశ్నించారు.