Oct 26, 2025, 16:10 IST/
తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Oct 26, 2025, 16:10 IST
తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.