కార్మికుల చెమట చుక్కకు విలువ కట్టే ఎర్రజెండా సీఐటీయూ 56 ఏళ్ల పోరాటం పూర్తి చేసుకుందని సీఐటీయూ ఉపాధ్యక్షులు సుధాకర్ తెలిపారు. మైలవరంలో సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. 1970 మే 30న పుట్టిన సీఐటీయూ, కోటి మంది సభ్యులతో దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 లేబర్ కోడ్‌లు తెచ్చి కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర చేస్తోందని సుధాకర్ మండిపడ్డారు.