నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన 'అఖండ' సినిమా మైలవరం థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమాను ఫ్యాన్స్, సాధారణ ప్రేక్షకులు, పిల్లలు కూడా చూసేందుకు థియేటర్లకు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా మైలవరంలో బాలయ్య అభిమానులు, టిడిపి నాయకులు ఆనందోత్సాహాల మధ్య భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.