వారంతా పూర్వ విద్యార్థులు. పాతిక ఏళ్ల క్రితం పదో తరగతి చదివి వెళ్లిపోయిన వారు. అప్పటి మధురస్మృతులను నెమరవేసుకుని పరవశించిపోయారు. ఈ అపూర్వ ఘట్టానికి వెలగలేరు వేదికైంది. జి. కొండూరు మండలం వెలగలేరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిలీనియం బ్యాచ్ పూర్వవిద్యార్థులు (1999-2000) 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఆదివారం వెలగలేరులోని హైస్కూలులో ఘనంగా జరుపుకున్నారు.