మైలవరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసులు నమోదు..

0చూసినవారు
మైలవరంలో శనివారం రాత్రి సిఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు చేసి, వారి వాహనాలను సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని సిఐ కిషోర్ బాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై, ఏఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్