కుట్రలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: లక్ష్మీపార్వతి

8చూసినవారు
ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కుట్రలకు, పాపాలకు కేంద్ర బిందువని, ఆయన చేసిన పాపాలు పండి శిక్ష అనుభవించడమే తరువాయి అని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబుకు దేవునిపై భక్తి లేదని, 1995లోనే దేవుడ్ని నమ్మనని అన్నారని, అందుకే తిరుమల లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు.

ట్యాగ్స్ :