మైలవరంలో శుక్రవారం 'వెన్నుపోటు కి రెండేళ్లు' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి 31 ఏళ్లు పూర్తయిందని, కొత్తగా పొడిచిన వెన్నుపోటుకు రెండేళ్లు అవుతోందని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పార్టీ అని, చంద్రబాబుది వి.పి. పార్టీ అని ఎద్దేవా చేశారు.