వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఎవరినైనా, ఎలాగైనా వాడుకుంటారని ఆమె ఆరోపించారు. ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీని వాడుకుంటున్నారని, గతంలో మోదీని తీవ్రంగా విమర్శించి ఇప్పుడు ఆయన చెంతకే చేరారని విమర్శించారు. జగన్ ఒక కనుసైగ చేస్తే చంద్రబాబు సామ్రాజ్యాన్ని కార్యకర్తలే కూల్చేస్తారని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.