గురువారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని RISE కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. మహిళల ఆర్థిక సాధికారత లక్ష్యంగా సాగుతున్న కార్యకలాపాలను ఆయన సమీక్షించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు నైపుణ్య శిక్షణ, వ్యవస్థాపకత, ఉపాధి కల్పనలో చురుగ్గా పాల్గొని, స్థానిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ, పట్టణ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.