గురువారం రెడ్డిగూడెం వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. దీంతో వాహనదారులు, జనజీవనం స్తంభించిపోయింది. మామిడి, మొక్కజొన్న, వరి పంటలు చేతికి వచ్చే సమయంలో కురిసిన ఈ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నష్టపోయి ఉన్నామని, ఈ వర్షంతో పూర్తిగా నష్టపోయామని రైతులు తెలిపారు.