మైలవరం మండల వ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో అనురాధ తెలిపారు. ఉదయం నుండి ఇప్పటి వరకు 60 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశామని, మధ్యాహ్నం లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆమె వెల్లడించారు. సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.