మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌ను విమర్శించే స్థాయి జోగి రమేష్‌కు లేదని రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి విజయబాబు అన్నారు. మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడంలో కృషి చేస్తుందని తెలిపారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన దోపిడీలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇకనైనా తన తీరు మార్చుకోవాలని విజయబాబు హెచ్చరించారు.