తన ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకులుగా ఉన్నారని మాజీ మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసకాండ జరుగుతోందని, చంద్రబాబు తనను, తన కుటుంబాన్ని హత్య చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. పెట్రోల్ బాంబులు, రాడ్లతో దాడి చేశారని, లోకేశ్ రౌడీలను దించారని, లోకేశ్ ఒళ్లు తగ్గింది, బుర్రపోయింది అనడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.