మైలవరం స్మశాన వాటిక ఆక్రమణ..

24చూసినవారు
మైలవరం, సుద్దిపేటలోని ఎస్సీ స్మశాన వాటిక కాలక్రమేణా ఆక్రమణకు గురవుతోందని స్థానికులు ఆరోపించారు. యాహోను, ఏసు, బాబూరావు తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 7.60 ఎకరాల భూమిని ఆక్రమించుకుంటున్నారని, దీనిపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని స్మశాన వాటికను కాపాడాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్