మాజీ మంత్రి జోగి రమేష్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు కావాలనే ఇంధనంపై కృత్రిమ కొరత సృష్టించి రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకునేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఏ రాష్ట్రంలోనూ ఇంధన కొరత లేదని, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ దొరక్కపోవడానికి కారణం కేవలం కూటమినేతలేనని ఆయన ఆరోపించారు.