జి. కొండూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేసి, ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు.