జి. కొండూరు: రోడ్డుపై ధర్నా: మాజీ మంత్రి జోగి రమేష్

4చూసినవారు
జి. కొండూరు: రోడ్డుపై ధర్నా: మాజీ మంత్రి జోగి రమేష్
జి. కొండూరు మండలంలో జి కొండూరు నుంచి దుగ్గిరారలపాడు వరకు ఉన్న రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుపై గుంతలు పడి ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని, కాళ్లు చేతులు విరిగిపోతున్నాయని బాధితులు వాపోతున్నారు. గురువారం, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పట్టించుకోకుండా రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేయడంలో, గుంతలు పూడ్చడంలో అశ్రద్ధ వహించిందని ఆరోపిస్తూ, "ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం" అంటూ నినాదాలు చేశారు. జి. కొండూరు-గంగినేని వెళ్లే రోడ్డు మార్గంలో రోడ్డు గుంతలలో మొక్కలు నాటి నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్