జి. కొండూరు: తాగునీటి కోసం వెలగలేరు గ్రామస్థుల ధర్నా

1చూసినవారు
జి. కొండూరు మండలంలోని వెలగలేరు హైస్కూల్ సమీప కాలనీలో తాగునీటి సమస్య తీవ్రమైంది. సుమారు 100 కుటుంబాలు నివసించే ఈ ప్రాంతంలో గతంలో రెండు ట్యాంకుల ద్వారా ఇంటింటికీ నీరు సరఫరా అయ్యేది. ప్రస్తుతం అధికారులు ఆ వ్యవస్థను నిలిపివేసి, కాలనీ చివరన ఒకే కుళాయి ఏర్పాటు చేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతం నుంచి నీరు తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నామని, పాత పద్ధతిలోనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్