మంగళవారం రాత్రి, జి. కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పిలుపు మేరకు PACS చైర్మన్ శ్రీహరి బాధితులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. 'మొంథా' తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ, అధికారులను అప్రమత్తం చేసి, సూచనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎస్సై పాల్గొన్నారు.