జి. కొండూరు మండలం కడింపోతవరంలో మంగళవారం రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 50-60 ఏళ్లు ఉంటుందని, సుమారు 10-15 రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ కుమార్ వెల్లడించారు. తమ ప్రాంతంలో ఎవరైనా కనుమరుగైతే జి. కొండూరు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఆయన ప్రజలను కోరారు.