గొల్లపూడి సాయిపురం కాలనీలో పార్కు అభివృద్ధి పనులకు ఆదివారం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ భూమి పూజ చేశారు. పిల్లలు, వృద్ధుల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారుల ఆట స్థలం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పచ్చదనంతో పాటు ఆధునిక సౌకర్యాలతో పార్కును తీర్చిదిద్దుతామని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.