మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యగా భారీగా మోహరించి, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రోడ్లపై గుంపులుగా ఉన్న వారిని చెదరగొడుతున్నారు.