సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంత గ్రామాలకు తరలివెళ్తుండటంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాహనాల సంఖ్య అధికంగా ఉండటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.