ఇబ్రహీంపట్నం బొడ్డు రాయి సెంటర్ లో గంజాయి మత్తులో బ్లేడ్ బ్యాచ్ వృద్ధుడిపై గురువారం దాడిచేసిన ఘటన చోటు చేసుకుంది. బ్లేడ్ బ్యాచ్ సభ్యులు వేరొక వ్యక్తిపై దాడికి ప్రయత్నిస్తుండగా అడ్డు వెళ్లిన వృద్ధుడిపై దాడి చేసినట్లు స్థానికులు అన్నారు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడు, హాస్పిటల్ కి తరలించిన అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు.