ఇబ్రహీంపట్నం: పునరావాస కేంద్రంలో ఇబ్బందులు (విడియో)

2573చూసినవారు
తుఫాను కారణంగా ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో లోతట్టు ప్రాంత ప్రజలు అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా కనీసం తాగడానికి, స్నానానికి మంచినీరు కూడా అందించలేకపోయారని బాధితులు వాపోయారు. ముసలివారు, బాలింతలు, పసిపిల్లలతో ఇబ్బందులు పడుతున్న తమను అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్