మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ప్రశ్నించేవారిని భయపెట్టడానికే చంద్రబాబు హింసాజ్వాలను రాజేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఈ మంటలు చంద్రబాబు సర్కార్‌ను దహించి వేయక తప్పదని హెచ్చరించారు. జోగి రమేష్‌కు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.