మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని రేపు (శుక్రవారం) ఈ నెల 6న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సందర్శించనున్నారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ ఇంటిని ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.